వేమూరు మండలం జంపని గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో నిర్వహిస్తున్న వార్షిక హనుమాన్ జయంతి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం స్వామివారికి విశేషంగా నింబఫల పూజ నిర్వహించారు మొవ్వ మల్లికార్జునరావు దంపతులు ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకం జరిపించి సాయంత్రం విశేషంగా అష్టోత్తర సహస్రనామ పూజ, పల్లకి ఉత్సవం జరిపించారు. భజన సమాజాల వారు హనుమాన్ చాలీసా పారాయణ భజన కీర్తనలు ఆలపించారు