శావల్యాపురం మండలం తహశీల్దార్ గా శివ నాగరాజుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటి వరకు ఇక్కడ బాధ్యతలు నిర్వహించిన లావణ్య ఇక్కడి నుంచి బదిలీ కాగా, ఆమె స్థానంలో శివనాగరాజుకు తహసీల్దార్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. మండల ఇన్ఛార్జ్ డిప్యూటీ తహశీల్దార్ గా సోముల నాసరయ్య లకు బాధ్యతలు అప్పగించగా, వారు గురువారం బాధ్యతలు చేపట్టారు.