యర్రగొండపాలెంలో సచివాలయాలకు పవర్ కట్

79చూసినవారు
యర్రగొండపాలెంలో సచివాలయాలకు పవర్ కట్
యర్రగొండపాలెంలోని 3, 4 గ్రామ సచివాలయాలకు విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో బుధవారం అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్లుగా వెల్లడించారు. దీంతో గ్రామ సచివాలయాలలో సేవలు నిలిచిపోయాయి. తమ పనులపై వస్తున్న ప్రజలు సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన సేవలు నిలిచిపోవడంతో వెన్నుతిరుగుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్