ఏపీలోని అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని సాయి శ్రేయాస్ ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్ ఘటన విషాదంగా మారింది. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన సేఫ్టీ మేనేజర్ పి. చంద్రశేఖర్, ఏపీలోని మునగపాకకు చెందిన సేఫ్టీ ఆఫీసర్ సరగడం కుమార్ మృతి చెందారు. ఒడిశాకు చెందిన హెల్పర్ బైడూ బైసాల్ పరిస్థితి విషమంగా ఉంది. మృతుల కుటుంబాలకు రూ. కోటి నష్టపరిహారం ఇవ్వాలని సీఐటీయూ నేత గనిశెట్టి డిమాండ్ చేశారు.