పారిస్ ఒలింపిక్స్‌లో ఆసీస్ తరపున బ్రేక్‌డ్యాన్స్ బరిలోకి దిగిన రేచల్ పతకం ఏమీ సాధించలేదు. కానీ, ఆమె చేసిన ‘కంగారూ’ స్టెప్పులు మాత్రం హైలైట్‌గా నిలిచాయి. సోషల్ మీడియాలో మీమ్స్, జోకులు హోరెత్తిపోయాయి. ఇదేం డ్యాన్సంటూ కామెంట్లు మరోవైపు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశాయి. దీంతో రేచల్ స్పందిస్తూ ఇలాంటి వాటిని ఆపేయాలని విజ్ఞప్తి చేసింది. మానసికంగా చాలా ఇబ్బందిగా ఉందని పేర్కొంది.