ఆరు మాసాల పసి పాపపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడు బోయిన ఎరుకన్న దొరకు 25 ఏళ్లు కఠిన కారాగార శిక్ష, రూ. 5 వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నాగమణి తీర్పు ఇచ్చినట్లు శుక్రవారం బొబ్బిలి డిఎస్పి శ్రీనివాసరావు తెలిపారు. రామభద్రపురం మండలం నేరేళ్లవలసలో బి. ఎరకన్నదొర 2024లో నమోదైన పోక్సో కేసులో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ అనంతరం చార్జిషీట్ దాఖలు చేశారు.