క్షేత్రస్థాయిలో బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని బొబ్బిలి బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ మరిశర్ల రామారావు అన్నారు. జిల్లా నాయకులు ఆదేశాల మేరకు బీజేపీ కార్యవర్గ ఎన్నికలను గురువారం నిర్వహించారు. మండల అధ్యక్షుడిగా తాడి ఈశ్వరరావు, పట్టణ అధ్యక్షురాలిగా నీలిమా చౌదరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నియోజకవర్గంలో బీజేపీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని రామారావు ఈ సందర్భంగా సూచించారు.