బొబ్బిలి: అక్రమంగా మద్యం విక్రయం.. వ్యక్తిపై కేసు

55చూసినవారు
బొబ్బిలి: అక్రమంగా మద్యం విక్రయం.. వ్యక్తిపై కేసు
అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసిన ఘటన బొబ్బిలి రూరల్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం సీఐ సతీష్ కుమార్ ఆదేశాలుతో మండల పరిధిలోని కోమటిపల్లి గ్రామంలో అక్రమంగా మద్యం అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో శుక్రవారం సాయంత్రం పోలీస్ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. 30 క్వార్టర్‌ బాటిళ్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్