బొబ్బిలి: దట్టంగా పొగమంచు.. వణికిస్తున్న ఉష్ణోగ్రతలు

57చూసినవారు
బొబ్బిలి: దట్టంగా పొగమంచు.. వణికిస్తున్న ఉష్ణోగ్రతలు
బొబ్బిలి ప్రాంతంలో పొగ మంచు కమ్మేసింది. శుక్రవారం ఉదయం దట్టమైన పొగ మంచు కురవడంతో వాహనదారులకు రహదారి సరిగా కనిపించకపోవడంతో లైట్లు వేసుకొని ప్రయాణించారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో వాహనదారులు 20, 30 కిలోమీటర్ల వేగంతో వాహనాలను నడపాల్సి వచ్చింది. మంచు తీవ్రత, చలి ప్రభావంతో బయటకు వెళ్లలేక ప్రతి రోజు ఉదయం 10 గంటల వరకు వృద్ధులు, చిన్నారులు ఇంటికే పరిమితమవుతున్నారు. స్కూల్ కి వెళ్ళడం ఇబ్బందిగా అవుతుంది.

సంబంధిత పోస్ట్