బొబ్బిలి: వృద్ధుడి అదృశ్యం

77చూసినవారు
బొబ్బిలి: వృద్ధుడి అదృశ్యం
బాడంగి మండలంలోని గజరాయునివలసకు చెందిన దాసరి సత్యం అనే వృద్ధుడు రెండు రోజులుగా కనిపించడం లేదని స్థానిక పోలీసులకు గురువారం ఫిర్యాదు అందింది. ఆయన కుమారుడు ఇచ్చిన ఫిర్యాదులో బుధవారం ఉదయం ఇంటినుంచి బయటకు వెళ్లిన వ్యక్తి మరుసటిరోజు వరకు ఇంటికి రాలేదని కావున పోలీసులు వెతికి తమకు అప్పగించాలని కోరినట్లు ఎస్ ఐ తారకేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్