అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యాపారిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బొబ్బిలి మండలం కారాడ గ్రామంలో గురువారం అక్రమ మద్యం అమ్మకాలు చేస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి 14 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు బొబ్బిలి ఎక్సైజ్ సీఐ పి. చిన్నంనాయుడు చెప్పారు. అతనిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తామని బెల్ట్ షాపులు నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.