బొబ్బిలి మండలం గొర్లి సీతారాంపురం గ్రామ జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం వ్యక్తిని అరెస్టు చేసి అతడి వద్ద నుంచి 125 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్‌ఐ భాస్కరావు తెలిపారు. సీఐ సతీష్ కుమార్ ఆదేశాలతో విశ్వసనీయ సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించినట్టు తెలిపారు. అతని వాహనాన్ని సీజ్ చేసి, వ్యక్తిని రిమాండ్ కు పంపించడం జరిగినదన్నారు.