ఆపరేషన్ సింధూర్‌లో భారత త్రివిధ దళాలు అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన విజయానికి ప్రతీకగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఎన్డీయే కూటమి పార్టీల ఆధ్వర్యంలో శనివారం బొబ్బిలి కోట నుండి తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే బేబీ నాయన మాట్లాడుతూ. పాకిస్తాన్ కుట్రలకు ఆపరేషన్ సింధూర్‌తో మన భారత సైన్యం గట్టిగా బుద్ధి చెప్పిందన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, బడా చైర్మన్, మాజీ సైనికులు, ప్రజలు పాల్గున్నారు.