బొబ్బిలి పట్టణంలో శ్రీ వేణుగోపాల్ స్వామి ఆలయంలో ఈనెల 6న పూలంగి సేవ నిర్వహిస్తున్నట్లుఆలయం అనువంశిక ధర్మకర్త, స్థానిక ఎమ్మెల్యే బేబినాయన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వేణుగోపాల్ స్వామి ఆలయంలో ధనుర్మాస మహోత్సవాలలో భాగంగా పూలంగి సేవను నిర్వహించనున్నారు. మూల విరాట్‌తో పాటు, ఇతర ఉత్సవ విగ్ర హాలను, ఆలయ ప్రాంగణాన్ని పూలతో అలంకరణకు పక్క రాష్ట్రాల నుండి పువ్వులు పూజ సామాగ్రి తెప్పిస్తామని ఎమ్మెల్యే చెప్పారు.