రేషన్ డిపోలను, రేషన్ సరుకులు డోర్ డెలివరీ చేస్తున్న వాహనాలను పౌరసరఫరాల అధికారి, డిప్యూటీ తహశీల్దార్ రెడ్డి సాయి కృష్ణ గురువారం ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆయా డిపోల పరిధిలో రేషన్ పంపిణీ చేస్తున్న ఎండీయు వాహనాలను కూడా తనిఖీ చేశారు. రేషన్ దుకాణాల్లో రికార్డుల ప్రకారం ఉండాల్సిన స్టాకును ఈ పోస్‌తో పాటు, ఫీల్డు స్టాకు నిల్వలను తనిఖీ చేశారు. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తే కేసులు నమోదవుతామన్నారు.