ధనుర్మాస సందర్భంగా సోమవారం బొబ్బిలి పట్టణం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న పూలంగి సేవ కార్యక్రమానికి 50 రకాల పూలతో అలంకరిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా వేణుగోపాలస్వామి ఆలయం ఆవరణంలో ఆదివారం వెంకన్న మాట్లాడుతూ తమిళనాడు, కర్ణాటక, ఊటీ పలు ప్రాంతాల్లో, ఇతర రాష్ట్రాల నుండి పూలు తెప్పించి స్వామివారి ని అలంకరిస్తున్నట్లు తెలిపారు. అలాగే బొబ్బిలి వీణను కూడా పూలుతో అలంకరిస్తున్నట్లు తెలిపారు.