బొబ్బిలి: పురుగుల మందు తాగి విద్యార్థి ఆత్మహత్యాయత్నం

59చూసినవారు
బొబ్బిలి: పురుగుల మందు తాగి విద్యార్థి ఆత్మహత్యాయత్నం
తెర్లాం బాలురు బిసి వసతి గృహంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి ఎన్. రాకేష్ మంగళవారం పురుగుల మందు తాగి అస్వస్థతకు గురయ్యాడని వార్డెన్ తెలిపారు. బాలుడును పిహెచ్ సీ కి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించామన్నారు. ఈ విద్యార్థి బ్యాగులో రెండు ట్యాబులు ఉన్నాయని ఇంకొకరి ట్యాబ్ దొంగిలించావని తోటి విద్యార్థులు అడుగగా భయపడి పురుగుల మందు తాగినట్లు విద్యార్థులు బుధవారం తెలిపారన్నారు.