పాతబొబ్బిలి సమీపంలో ఉన్న గుంతల వద్ద ముందు వెళ్తున్న ఆటోను ఢీకొని బైక్ పై వెళ్తున్న ఇద్దరు విద్యార్థులు గాయాల పాలయ్యారు. బొబ్బిలి సత్యసాయి జూనియర్ కాలేజ్ లో చదువుతున్న మన్యం జిల్లా సీతానగరం మండలం కాశియ్యపేటకు చెందిన మడక మేఘసాయి, అదే మండలం అంటిపేటకు చెందిన దిలీప్ కుమార్ వారి స్వగ్రామాలకు బైక్ పై శనివారం వెళ్తున్నారు. పాత బొబ్బిలి సమీపంలో గుంతల వద్ద ముందు వెళ్తున్న ఆటోను ఢీకొన్నారు.