ఉత్తమ ఎంపిడిఓగా పి. రవికుమార్ ఎంపికయ్యారు. ఈ మేరకు జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతులు మీదుగా గురువారం అవార్డు అందుకున్నారు. ఈయన బొబ్బిలి మండలంలో ఎంపిడిఓగా పని చేస్తున్నారు. ఈయనకు అవార్డు రావడం పట్ల తోటి అధికారులు, సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయం ఉద్యోగులు, తదితరులు అభినందనలు తెలిపారు.