నిత్యం ప్రజాసేవలో నిమగ్నమై ఉండే పోలీస్ సిబ్బంది శాఖాపరమైన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నామని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ వెల్ఫేర్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా పోలీసుశాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కా రానికి వ్యక్తిగతమైన సమస్యలను పరిష్కరించడానికి అడిగి తెలుసుకున్నారు.