సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బొబ్బిలి రూరల్ సర్కిల్ సీఐ నారాయణరావు సూచించారు. రామభద్రపురం పోలీసు స్టేషన్లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ. ఇటీవల సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా అపరిచిత వ్యక్తులు కాల్ చేసి ఓటీపీలు, బ్యాంకు అకౌంట్ నంబర్లు అడిగిన చెప్పవద్దన్నారు. ప్రతీ ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని తెలిపారు.