రామభద్రపురం: మొక్కల పెంపకంతో వేసవి తాపం నుంచి రక్షణ

72చూసినవారు
స్వచ్ఛ ఆంధ్రా - స్వర్ణాంధ్ర కార్యక్రమాల్లో బాగంగా శనివారం రామభద్రపురంలో గ్రామపంచాయతీ, ఎంపీపీ స్కూల్ లలో టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి చింతల రామకృష్ణ, ఎంపీడీవో రత్నం ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. మొక్కల పెంపకం, సంరక్షణ ద్వారా వేసవి తాపం నుంచి రక్షణ పొందవచ్చునని రత్నం తెలిపారు. ప్రతీ ఒక్కరూ పరిసరాల్లో మొక్కలు నాటాలని సూచించారు. అనంతరం స్వచ్ఛ కార్యక్రమానికి సహకరిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

సంబంధిత పోస్ట్