బొబ్బిలి మున్సిపాలిటీలో రోడ్ల విస్తరణ ఎప్పుడు చేస్తారని నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ మువ్వల శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఈ సందర్బంగా శనివారం మాట్లాడుతూ ఏ పార్టీ నాయకుడైన తన ఊరు అభివృద్ధిని కోరుకుంటారు, కాని బొబ్బిలి నియోజకవర్గంలోని టిడిపి, వైసీపీ కూటమి ప్రభుత్వం రోడ్లు విస్తరణ చేయటానికి సుముఖంగా లేరని స్పష్టంగా అర్థం అవుతుందన్నారు. ఇప్పటికైనా నాయకులు స్పందించి రోడ్లు విస్తరణ చేపట్టాలన్నారు.