గరివిడి పట్టణానికి చెందిన దండు సాయి సుక్రిత అదృశ్యమైన ఘటనకు సంబంధించి విజయనగరం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ శ్రీనివాసరావు శనివారం కేసు నమోదు చేశారు. సాయి సుక్రిత విశాఖపట్నం వెళ్తున్నానని ఇంట్లో చెప్పి గరివిడి నుండి విజయనగరం వచ్చి బస్సు ఎక్కిన తర్వాత తల్లిదండ్రులకు ఫోన్ చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు ఇంటికి చేరికోకపోవడంతో ఆమె తండ్రి రామరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.