రక్తదాన శిబిరంను విజయవంతం చేయాలని విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షులు, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున కోరారు. ఈ నెల 20వ తేది మంగళవారం జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకులకు సంబందించిన పోస్టర్ ను శుక్రవారం చీపురుపల్లిలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా నాగార్జున మాట్లాడుతూ.. రక్తదానం చేయటం వలన దాతలు ఆరోగ్యoగా ఉంటారని అన్నారు. సమాజ సేవలో టీం తారక్ సభ్యులు బాధ్యతగా వ్యవహరిస్తున్నారని అన్నారు.