చీపురుపల్లి: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావాన్ని కలిగి ఉండాలి

69చూసినవారు
చీపురుపల్లి: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావాన్ని కలిగి ఉండాలి
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావాన్ని కలిగి ఉండాలని సినీ నటుడు సుమన్ అన్నారు. శనివారం చీపురుపల్లిలోని ప్రముఖ దైవ క్షేత్రం శ్రీ మానసా దేవిని ఆయన దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు సాంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక టిడిపి నాయకులు ఎన్ నారాయణ రావు సుమన్ కు దుస్సాలువా తో సత్కరించారు. సుమన్ ను చూసేందుకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

సంబంధిత పోస్ట్