చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు సోదరుడు సత్యనారాయణ ఇటీవల మృతి చెందడం విధితమే. ఈ నేపథ్యంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించి, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం సత్యనారాయణ మృతికి గల కారణాలను ఎమ్మెల్యేను అడిగి తెలుసుకున్నారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.