చీపురుపల్లి మండల కేంద్రంలో వెలసిన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతరకు సంబంధించి పెద్దలు, ఈవో బి శ్రీనివాసరావు సమక్షంలో ఆదివారం ముహూర్తపు రాట వేశారు. అమ్మవారి జాతరకు తొలి ఘట్టం మొదలైందని తెలిపారు. ఈవో శ్రీనివాసరావు మాట్లాడుతూ అమ్మవారి జాతర మార్చి 2 నుండి 4వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను ప్రారంభించినట్లు అన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.