ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం హయాంలో కృషి చేస్తానని చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకట్రావు అన్నారు. శనివారం ఆయన చీపురుపల్లిలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ కూటమి నాయకులు పాల్గొన్నారు.