మెరకముడిదాం: జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని విజయవంతం చేయండి

79చూసినవారు
మెరకముడిదాం: జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని విజయవంతం చేయండి
ఈనెల 10న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని అధికారులు విజయవంతంగా నిర్వహించాలని మెరకముడిదాం ఎంపీడీవో భాస్కరరావు కోరారు. శుక్రవారం ఆయన విద్యా, వైద్యాధికారులతో తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో, కళాశాలల్లో, అంగన్వాడి కేంద్రాల్లో 19 ఏళ్ల లోపు విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్