మెరకముడిదాం: మా గ్రామంలో పాఠశాలను కొనసాగించాలి

66చూసినవారు
మెరకముడిదాం: మా గ్రామంలో పాఠశాలను కొనసాగించాలి
మెరకముడిదాం మండలం బిల్లలవలసలో సాంఘిక సంక్షేమ పాఠశాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ గ్రామస్తులు సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన పాఠశాలను అధికారులు మూసివేయడం తగదని మండిపడ్డారు. మా గ్రామంలో విద్యార్థులకు ఈ పాఠశాల సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. పాఠశాలను మూసివేసి, విద్యార్థులను వేరే పాఠశాలకు తరలించడం తగదని తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్