చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకట్రావు ను ఎస్. కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి శుక్రవారం రాజాంలోని ఆయన స్వగృహంలో పరామర్శించారు. ఇటీవల ఎమ్మెల్యే కళా వెంకట్రావు సోదరుడు మృతి చెందడం తెలిసిందే. ఈ నేపథ్యంలో లలిత కుమారి ఆయనను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి కార్య నిర్వాహక కార్యదర్శి బాలాజీ రాంప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ మల్లిక్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.