కొత్తవలస మండల పంచాయతీ కార్యదర్శులు కార్యవర్గ ఎన్నిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించారు. ఎన్నికల అధికారిగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎస్. రమణయ్య కీలకంగా వ్యవహరించారు. కొత్తవలస మండల పంచాయతీ కార్యదర్శులుగా కోటంశెట్టి వెంకటరావు నియమితులయ్యారు. ప్రధాన కార్యదర్శిగా విశ్వనాథ కృష్ణారావు, ఉపాధ్యక్షులుగా లోపింటి చిన్నారావు, షేక్ షహనాజ్ ఎన్నికయ్యారు.