దత్తిరాజేరు: ఇళ్ల పట్టాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చిన ఎంపీ

75చూసినవారు
దత్తిరాజేరు: ఇళ్ల పట్టాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చిన ఎంపీ
దత్తిరాజేరు మండలం పెదమానాపురంలో 3 వ రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా ఇళ్ళు కోల్పోయిన బాధితులను విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆదివారం కలసి వారి సమస్యలను అడిగ తెలుసుకున్నారు. ఇళ్ళు కోల్పోయిన బాధితులకు ఇల్ల పట్టాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. కాగా 2020 సంవత్సరం మార్కెట్ రేటు ప్రకారం తమకు నష్ట పరిహారం అధికారులు ఇస్తున్నారని, ఇప్పటి రేటు ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని బాధితులు ఎంపీని కోరారు.

సంబంధిత పోస్ట్