గజపతినగరం పీహెచ్సీని డి సి హెచ్ రామలక్ష్మి శనివారం సాధారణ తనిఖీల్లో భాగంగా సందర్శించారు. ఆసుపత్రిలో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. వైద్యులకు అందిస్తున్న వైద్య సేవల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వైద్యులకు కల్పిస్తున్న మౌలిక సౌకర్యాలు పై ఆరా తీశారు. ఇటీవల ఈ ఆసుపత్రి నుండి ఓ గర్భిణీని ఘోషాసపత్రికి రిఫర్ చేసిన నేపథ్యంలో వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు సమయపాలన పాటించాలని కోరారు.