బొండపల్లి మండలంలోని దేవుపల్లి గ్రామంలో స్వయంభూగా వెలసిన రాజరాజేశ్వరిదేవి ఆలయంలో మంగళవారం రథసప్తమి పర్వదినాన అమ్మవారి పాదాలకు, రాజరాజేశ్వర స్వామి శివలింగానికి, శ్రీ చక్రాన్ని తొలి సూర్యకిరణాలు తాకాయి. ఆలయ అర్చకులు దూసి శ్రీధర్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు.