కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని రాష్ట్ర చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం దత్తిరాజేరు మండలంలోని ఇంగిలాపల్లి- గదబవలస గ్రామాల మధ్య తారు రోడ్డు నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. వైసిపి ప్రభుత్వ హయంలో రోడ్ల గురించి పట్టించుకోలేదన్నారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో అధికారులు టిడిపి నాయకులు పాల్గొన్నారు.