గజపతినగరంలోని పైడితల్లి అమ్మవారి ఆలయం వార్షికోత్సవ మహోత్సవానికి మంగళవారం మాజీ శాసనసభ్యులు బొత్స అప్పల నరసయ్య హాజరయ్యారు. పైడితల్లమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైసిపి నాయకులు ముత్యాలనాయుడు, కర్రి రామునాయుడు, గేదెల ఈశ్వరరావు, బోడసంగి జగదీష్, తదితరులు పాల్గొన్నారు.