గజపతినగరంలోని పైడితల్లమ్మ ఆలయం ద్వితీయ వార్షికోత్సవ మహోత్సవంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం సాయంత్రం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయం ధర్మకర్త కందుల చిన్నయ్యస్వామి మంత్రి శ్రీనివాస్ కు పండ్లు అందజేశారు. మాజీ ఎంపీపీలు గంట్యాడ శ్రీదేవి, మక్కువ శ్రీధర్, గోపాలరాజు, ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.