సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం సాయంత్రం బొండపల్లిలో ప్రజా సమస్యలపై ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి మాట్లాడుతూ గత ఐదేళ్లలో ప్రజా సమస్యలు పరిష్కారం కాలేదని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా దర్బార్ ద్వారా పరిష్కరిస్తున్నామని చెప్పారు. గోపాల రాజు బుద్ధరాజు సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు.