గంట్యాడ మండల కేంద్రంలోని ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని మంగళవారం విజయనగరం రెవెన్యూ డివిజనల్ అధికారి దాట్ల కీర్తి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్ర భవనాన్ని పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలో తాగునీరు, విద్యుత్తు, టాయిలెట్లు తదితర మౌలిక సదుపాయాల గురించి ఆరా తీశారు. అనంతరం పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గంట్యాడ తహసిల్దార్ నీలకంటేశ్వర రెడ్డి, బి ఎల్ వోలు పాల్గొన్నారు.