ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అమలులో ఉన్న ఎన్నికల కోడ్ ను ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని గంట్యాడ తాసిల్దార్ నీలకంఠేశ్వర రెడ్డి అన్నారు. సోమవారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ మండలంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరగకుండా ఉండేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే రాజకీయ నాయకులకు సంబంధించిన ఫ్లెక్సీలను తొలగించామని, రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు తొడిగినట్లు తెలిపారు.