గంట్యాడ మండలంలోని ఓ రైస్ మిల్లును మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సూర్య రాజ్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైస్ మిల్లులో అక్రమంగా పిడిఎఫ్ రైస్ కొనుగోలు చేసి నిల్వ ఉంచారని సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. రైస్ మిల్లులో ఎటువంటి పిడిఎఫ్ బియ్యం లేవని నిర్ధారించినట్లు చెప్పారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కొనుగోలు చేసిన పిడిఎఫ్ బియ్యాన్ని అమ్మినా, కొనుగోలు చేసిన చట్టపరమైన చర్యలు తప్పవని అన్నారు.