మెంటాడ గ్రామంలో ధనుర్మాసం ఉత్సవాల్లో భాగంగా ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ముడుపులు సేవ నిర్వహించారు. ఈకార్యక్రమంతో ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. అధిక సంఖ్యలో చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు తరలి వచ్చారు. ఆనంతరం భక్తులందరికి ప్రసాదం అందించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు భోగి పండుగ వరకు ఉంటాయని అర్చకులు తెలిపారు.