మెంటాడ మండలం మిర్తివలస గ్రామానికి చెందిన గర్భిణీ పి. గౌరమ్మను 108 సిబ్బంది గజపతినగరం కమ్యూనిటీ ఆసుపత్రికి ప్రసవం నిమిత్తం మంగళవారం సాయంత్రం తీసుకువచ్చారు. అయితే ఒకసారి ఆపరేషన్ చేసిన మహిళకు రెండవ కాన్పు కోసం ఇక్కడకు ఎందుకు తీసుకువచ్చారని గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది చెప్పారు. దీంతో విజయనగరం ఆసుపత్రికి తీసుకువెళ్లే క్రమంలో ఆర్కే టౌన్షిప్ వద్ద ఆమె ప్రసవించి మగ బిడ్డకు జన్మనిచ్చిందన్నారు.