మెంటాడ మండలం ఆగూరులో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శనివారం వేసవి ఎండలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వేసవి ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఉదయం 6 నుంచి 9 గంటలలోపు పనులు చేసుకోవాలని సూచించారు. 9 గంటల తర్వాత ఎండలో బయటికి వెళ్లినప్పుడు మంచినీళ్లు, మజ్జిగ వెంట తీసుకువెళ్లాలన్నారు. వడదెబ్బ తగిలి పడిపోతే తడి గుడ్డతో ఒళ్లంతా తుడిచి సమీప ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించారు.