గజపతినగరం మండలంలోని లోగిస, సీతారాంపురం గ్రామాల నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పట్టుకున్నామని గురువారం రాత్రి గజపతినగరం ఎస్. ఐ యు మహేష్ తెలిపారు. కుమిలి ఎల్లంనాయుడు, మంత్రి గోవింద, గండ్రేటి భాస్కరరావులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఈ దాడిలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.