విజయనగరం: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

78చూసినవారు
విజయనగరం: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
కాకినాడ జిల్లా తుని రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో తుని - అన్నవరం స్టేషన్ మధ్య శనివారం రైలు నుంచి జారిపడి యువకుడు మృతి చెందాడు. అక్కడి జిఆర్పి పోలిసులు తెలిపిన వివరాల ప్రకారం విజయనగరం జిల్లాకు చెందిన ఆర్లి ఈశ్వరరావు (23) గజపతినగరం నుంచి అన్నవరం రైలులో ప్రయాణం చేస్తూ ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడన్నారు. మృతుడి వద్ద సెల్ ఫోన్ ఆధారంగా దివిస్ ఫార్మా కంపెనీలో ఉద్యోగిగా గుర్తించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్