గుమ్మలక్ష్మీపురం మండలంలో ప్రభుత్వం ద్వారా పది అంగన్వాడీ సెంటర్లకు ఎల్ఈడి టీవీలు, మూడు అంగన్వాడీ సెంటర్లకు ఆర్వో వాటర్ మినరల్ ప్యూరిఫైయర్ అందించినట్లు శుక్రవారం అంగన్వాడీ టీచర్ బి. సుధ తెలిపారు. చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు, ఇతర ఫర్నిచర్ అందించారన్నారు. అనంతరం గ్రామ సర్పంచ్ గౌరీశంకర్రావు ఆర్వో ప్లాంట్ ను ప్రారంభించారు. అధికారులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.