
నరసాపురం మున్సిపాలిటీలో విజిలెన్స్ తనిఖీలు
నరసాపురం మున్సిపాలిటీలో విజిలెన్స్ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. పలు విభాగాల్లోని రికార్డులను పరిశీలించారు. జిఎడి విజిలెన్స్ డిఇ శ్రీనివాసన్ నేతృత్వంలో పలు విభాగాల్లో పని చేసే అధికారులను రప్పించి వివరాలు కోరారు. గతంలో పని చేసి బదిలీ అయిన ఇంజినీర్లు సురేష్, సునీల్, రవిచంద్ర, మణిలను కూడా పిలిపించారు. వారి హాయాంలోని ఎం. బుక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.